శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం

శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గిరిజన శక్తి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు- భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ రామనాథ్, నిర్మల్ జిల్లా బంజారా జాక్ సామాజిక చైతన్యకరుడు జాదవ్ విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని లోయపల్లి తండాలో గుర్తు తెలియని దుండగులు శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడం సరికాదన్నారు. అదే స్థలంలో మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే లంబాడీ సమాజం అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేవలాల్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమైన విషయమని అన్నారు. లంబాడీ సమాజం ఆత్మగౌరవాన్ని కాపాడేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు