

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మార్చి 4 నుండి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో అధ్యక్షుడు మొట్టల దీపక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇంచార్జ్ ఇంజం వెంకటస్వామి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో 11 శాతం రిజర్వేషన్ రావాల్సిందిగా సూచించబడినా, కేవలం 9 శాతానికి పరిమితం చేసారని మండిపడ్డారు. ఈ లోపాలను సవరించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గందమాల నాగభూషణం మాదిగ, జాతీయ మహిళా నాయకురాలు యమున, జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్, ధర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్, డప్పు నర్సయ్య, సంగేమ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.