

ముమ్మరంగా సాగుతున్న పారిశుద్ధ్య పనులు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 03 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు తీసిన మట్టిని తొలగించే వనులు చేపడుతున్నారు. అదేవిధంగా చెత్తాచెదారాన్ని ఇంటింటా తిరుగుతూ సేకరించి వాహనంలో తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ మాట్లాడుతు ప్రజలు తమ వంతు బాధ్యతగా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా చెత్త బండిలోనే వేయాలన్నారు. ప్రజల సహకారంతో పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా మురుగు కాలువలను శుభ్రం చేసే పనులు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు