భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

భీమారంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.

*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 03 :- భీమారం మండల కేంద్రంలో బీజేవైఎం మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు కొమ్ము కుమార్ యాదవ్,భీమారం మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేశం యాదవ్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కగా అమలు చేస్తా అని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవి భూములను అక్రమంగా అభివృద్ధి పేరు చెప్పి రియల్ఎస్టేట్ చేస్తుంది. కమీషన్ ల పేరుతో సొమ్ము కాజెసుకోవాలని హైదరాబాదు నగరానికి గుండెకాయలాంటి హెచ్ సి యు గచ్చిబౌలి కంచె అడవి ప్రాంతాన్ని నరికివేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కొల్లగొడుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్నటి వంటి పోరాటానికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న బిజెవైఎం నాయకులను పోలీసులు అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. తల్లిలాంటి (ప్రకృతి) అడవులను నరికివేయడం సరి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిక్కుమాలిన చర్యలని వెనక్కి తీసుకునేవరకు మా పోరాటం ఆగదని భారతీయ జనతా యువమోర్చా నాయకులు హెచ్చరించారు.

  • Related Posts

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం మనోరంజని ప్రతినిధి ఖమ్మం జిల్లా: ఏప్రిల్ 12 – ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ బస్టాండ్ లొ ఓ వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని విఎం బంజర్ పోలీసులు పట్టుకున్నారు,…

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 11 :-పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఉన్నదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

    ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం

    పేదింటి ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం

    బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే

    బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే

    అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు

    అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు