కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

కాంస్య పథకం సాధించిన స్వాతికి సన్మానం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 23 నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ట గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ, శేఖర్-సుగుణ దంపతుల కుమార్తె స్వాతి గత ఫిబ్రవరి నెలలో రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర క్రీడ అథారిటీ వాళ్లు నిర్వహించిన జావిలిన్ త్రో పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా రెడ్డి సంఘం కమిటీ అధ్యక్షుడు గుమ్ముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి కులస్తులు స్వాతిని శాలువాతో సన్మానించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా రెడ్డి సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపిటిసి సునీత పోశట్టి, రాజేష్ కుమార్, రమేష్, భూమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విజయంలో వెన్నుండి ముందకు నడిపిన తల్లిదండ్రులను కూడా శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడపిల్లైన కూడా మొక్కువోని దీక్షతో ఆసక్తి ఉన్న క్రీడపై పట్టు సాధించి, భవిష్యత్తులో ఇంకా మరెన్నో పోటీల్లో పాల్గొనాలని పథకాలు సాధించాలని అభినందించడం జరిగింది. మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర పోటీలో పాల్గొని ఆష్టం గ్రామ పేరును, సంఘం ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు స్వాతిని అభినందిస్తూ భవిష్యత్తులో ఆమెకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.

  • Related Posts

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు. మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ