Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

Harish Rao | సిద్దిపేట/ నారాయణరావుపేట, మార్చి23 : వడగండ్ల వాన వల్ల చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగింది.. ప్రభుత్వం వెంటనే నష్ట పోయిన రైతులను గుర్తించి ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్షీదేవి పల్లి గ్రామంలో శనివారం ర్రాతి కురిసిన వడ గండ్ల వానకు నష్టపోయిన ఎల్కపల్లి నర్సింలు వరి పంటలను, రామస్వామి బోప్పాయి తోటను ఆయన పరిశీలించారు. వడగండ్ల వాన వల్ల పంటలు నష్ట పోయిన రైతులను నష్టం వివరాలను ఆడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులను దగా చేస్తుందన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో చాలా మాటలు చెప్పి నేడు అమలు చేయడం లేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. రూ.2లక్షలకు పైన రుణం ఉంటే పైన డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అని చెప్పి.. నేడు ఆసెంబ్లీలో ఆడుగితే రూ.2లక్షలపైన రైతులకు రుణమాఫీ చేయమని చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఏ ఊరిలోకి పోయిన సగం మంది రైతులకు రుణమమాఫీ కాలేదన్నారు. రైతుబంధు రూపంలో కేసీఆర్‌ రైతులకు నేరుగా సహాయం చేశాడన్నారు. ఓకసారి కాదు..రెండు సార్లు కాదు కేసీఆర్‌ 11విడుతల్లో రూ.73వేల కోట్లు రైతుబందు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు.కాంగ్రేస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హమీ ఎకరాకు రూ.7500 చోప్పున వాన కాలం యాసంగి పంటలకు సంబందించిన రైతుబంధు డబ్బులు ఎకరాకు రూ. 15000 వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని పంటలకు బోనస్‌ క్వింటలకు రూ.500 ఇస్తామన్నారు. నేడు బోనస్‌ బోగస్‌ ఆయ్యిందన్నారు. పంటల భీమా అని చెప్పి రూ.1300 కోట్ల బడ్జెట్‌లో పెట్టమన్నారు. రైతులకు మూడు పంటలకు బీమా రాలేదన్నారు. రైతులకు రూపాయి సహాయం అందలేదని విమర్శించారు. బీమా ఉండి ఉంటే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదన్నారు.ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లాలో పోయిన ఎప్రిల్‌ల్లో వడగండ్ల వానలు ,పోయిన ఎడాది మే నెలలో వడగండ్లు పడి నష్ట పోయిన రైతులకు ఒక్క రూపాయి కాంగ్రేస్‌ ప్రభుత్వం సహాయం చేయలేదన్నారు. పైగా ఇచ్చామమని ఆబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా చేయకున్న రుణమాఫీ చేశామని అసెంబ్లీలో కాంగ్రెస్‌ మంత్రులు అబద్ధాలు చెబుతున్నరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పాలిట బడే జూటేబాజ్‌ పార్టి ఆయిందన్నారు.

]కాలం తెచ్చిన కరువు కాదు-కాంగ్రెస్‌ తెచ్చిన కరువు


సీఎం రేవంత్‌ రెడ్డి కొత్త కథలు చెబుతున్నాడు. ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని చెబుతున్నాడు. రేవంత్‌రెడ్డి వచ్చినంకనే ఎండలు కొట్టాయా .. రేవంత్‌రెడ్డి ఎండల వల్ల పంటలు ఎండుతలేవు. నీ ప్రభుత్వ వైఫల్యం. ఆసమమర్థతతో నీవు సకాలంలో ప్రాజుక్టుల మోటార్లు చాలు చేయకపోవడం వల్లనే పంటలు ఎండుతున్నాయన్నారు.

వరంగల్‌ జిల్లాలో 1 లక్షా 50వేల ఎకరాల్లో పంట ఎండిందంటే కాంగ్రెస్‌ వైపల్యంతోనే నేడు పంటలు ఎండుతున్నాయన్నారు. ఎండల వల్ల ఎండడం లేదు కాంగ్రెస్‌ అసమర్ధ పాలన వల్ల సాగునీరు ఇవ్వలేక పోవడం వల్లేనే పంటలు ఎండిపోతున్నాయన్నారు. పంటలు ఎండ గోట్టేదే కాంగ్రేస్‌ పార్టీ అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు ఎక్కడెక్కడ వడగండ్ల వానలు పడ్డ ప్రాంతాల్లో ఆదికారులను పంపి.. వ్యవసాయ శాఖ అధికారులు క్ష్రేతస్థాయిలో పర్యటించి పంట నష్టంను ఆంచనా వేసి తక్షణం ఆర్థిక సహాయం ఆందించాలన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, లక్ష్మిదేవిపల్లి మాజీ సర్పంచ్‌ బోంగురం మంజుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలకృష్ణ, మాజీ ఎంపీటీసి దండు సప్న-ప్రభాకర్‌, నాయకులు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు అంజనేయులు, పర్శరాములు,నారాయణ, శంకర్‌బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు. మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 29 :-*మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు శనివారం ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సహాయంతో కేవలం 5 నిమిషాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    బోసి గ్రామంలో భూసార పరీక్ష క్యాంపు.

    శ్రీ నాగభూషణ విద్యాలయంలో ఉగాది వేడుకలు

    శ్రీ నాగభూషణ విద్యాలయంలో ఉగాది వేడుకలు