పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన రెహమాన్ ఫౌండేషన్

పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన రెహమాన్ ఫౌండేషన్

రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

మనోరంజని ప్రతినిధి లింగాపూర్ మార్చి 23 – లింగాపూర్ : ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలోని రాథోడ్ అనుషా బాయి నరేందర్ నిరుపేద దంపతుల ప్రథమ పుత్రిక రాథోడ్ నందిని కుషాల్ గార్ల వివాహ వేడుకలు సంస్కృతి, సాంప్రదాయల నడుమ వేద మంత్రాలతో ఆదివారం ఘనంగా జరిగాయి. ఆడబిడ్డ పెళ్లి విషయాన్ని లింగాపూర్ మండల ఇంచార్జి జా దవిత్ కుమార్ రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ : డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని వివరించగా చైర్మన్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని లింగాపూర్ రెహమాన్ ఫౌండేషన్ ఇంచార్జి జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా ఆడబిడ్డ కుటుంబ సభ్యులకు అందించి ఆర్థిక భరోసాగా నిలవడం జరిగింది. అనంతరం సభ్యులు వధూవరులను పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద ఆడబిడ్డ పెళ్లి కార్యానికి సహయం చేయాలనే సామాజిక సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని రెహమాన్ ఫౌండేషన్ సభ్యులన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ రెహమాన్ ఫౌండేషన్ సభ్యులు జాధవ్ కైలాష్, జాధవ్ అజేష్ కుమార్, జాధవ్ రజిత్ కుమార్, ఆడే కేతన్ నాయక్, జాధవ్ వికాస్, రాథోడ్ లఖన్, రాథోడ్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు…!!

  • Related Posts

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ! TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే…

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!! ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఏలకే అవకాశండిగ్రీ లేదంటే ఇంటర్ అర్హతతో పాటు ఐదేండ్ల అనుభవం తప్పనిసరిగైడ్లైన్స్తోపాటు జాబ్చార్ట్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    గ్రామపాలన అధికారుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్..!!

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం