ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

ఆదివాసి మహిళ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదు

కార్పొరేటర్ బాణావత్ సుజాత నాయక్ కు క్షమాపణ చెప్పాలి

ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 23 :- ఆదివాసి మహిళా కార్పొరేటర్ బాణవత్ సుజాత నాయక్ పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్ మా ఆదివాసి మహిళ కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన నువ్వు వెంటనే మా ఆడబిడ్డకు క్షమాపణ చెప్పాలని అదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆదివాసి మహిళ అని చూడకుండా అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం సమాజానికి సిగ్గుచేటని సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయ సమాజానికి పనికి రాడని తను తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆదివాసుల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు దొరల అహంకార ధోరణిని మార్చుకోకపోతే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ మండల చైర్మన్లు ఆత్రం ఊర్వేత ఆనందరావు రాజేశ్వర్ వసంతరావు వెడ్మ శేఖర్ జాదో రోహిదాస్ ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని శ్రీ అక్షర, రబింద్ర, సరస్వతి శిశు మందిర్, లిటిల్ ఫ్లవర్ పాఠశాల, బ్రహ్మణ్ గావ్ లోని హైందవి పాఠశాలలో…

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి

    రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :-ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ కొరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పేర్కొన్నారు. రంజాన్ రోజు ప్రార్థన చేసే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

    టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి

    రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

    రామాలయంలో ఏప్రిల్ 4న శాస్త్రీయ నృత్య కళా పోటీలు

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు

    ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు