మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ నియామకం

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 22 :- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ ను మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 21, 2025న కరీంనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ప్రకటన చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన కొత్త బాధ్యతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్‌గా నియమితులైన కుడెల్లి ప్రవీణ్ కుమార్ మాదిగ, పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యాచరణ అమలుకు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ మాట్లాడుతూ, ఉద్యమ కార్యాచరణలో కుడెల్లి ప్రవీణ్ కుమార్ చేసిన కృషిని గుర్తించి ఈ పదోన్నతి అందించామని తెలిపారు. ఉద్యమ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

  • Related Posts

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు…

    పల్సి ఉన్నత పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలు… -పండుగలు భారతీయ సంస్కృతి కి ప్రతికలు… మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చ్ 29; తెలుగువారి నూతన సంవత్సరం (శ్రీ విశ్వ వసు) ఉగాది ఉత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి…

    గోరు బోలి (లంబాడా) భాషకు గౌరవం – తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక నిర్ణయం!

    తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ నేతృత్వంలో మామడ మండలంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

    ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

    హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం?