

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపిన బిజెపి నాయకులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, మార్చి 20 మనోరంజని ప్రతినిధి, ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు, మరియు నాయకులు కార్యకర్తలు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కార్యకర్తలు భారీగా బ్లడ్ డొనేషన్ చేశారు, ఈ సందర్భంగా బిజెపి నాయకులు గజ్జల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఎల్లవేళలా ప్రజలకు సేవ చేస్తూ, ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని శ్రీరాముడి ఆశీస్సులతోపాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని మరిన్ని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని కోరుచున్నాము, ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి బీజేవైఎం సీనియర్ నాయకులు దొండి ప్రకాష్, మందుల బాలు, కలిగోట్ ప్రశాంత్, సురేష్, ఖాందేశ్ ప్రశాంత్, బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు