పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

మనోరంజని ప్రతినిధి అమరావతి: మార్చి 18 – పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణ ఈరోజు ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు చేసి దాన్ని మీడియా సమావే శంలో పెట్టి.. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని. దీనిపై గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తెలుగు యువత నేత వంశీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రస్తుతం పోసాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పోసానిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు… ఆ ఫోటోను ఎవరు తయారు చేశారు.. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది.. పోసానినే ఫోటో తయారు చేసి మీడియా సమావేశం పెట్టారా? లేక మరెవరైనా ఫోటో తయారు చేసి సమావేశం పెట్టమని ఆదేశించారా? అనే కోణంలో కస్టడీలో సీఐడీ అధికారులు పోసానిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత జీజీహెచ్‌లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా జైలుకు తరలించారు అయితే పోసానిని మరోసారి కస్టడీ విచారణకు తీసుకోవాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పోసాని బెయిల్ పిటిషన్ బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. పోసాని కృష్ణమురళిని కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

  • Related Posts

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    ముగ్గురిపై కేసు నమోదు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో యువతిపై దాడి చేసి శారీరకంగా కలవాలని బెదిరించి గాయపరిచిన ఘటన జరిగింది. ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక మహిళతో కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు…

    విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు !

    విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపు ! అధికారం ఉంది కదా ప్రతీ దానికి వైఎస్ఆర్ పేరు తగిలించుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకపోయినా వివిధ సంస్థలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    యువతిపై దాడి…అత్యాచార యత్నం

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా, కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలని కోరింది.

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం

    హైదరాబాదులో మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు ..తెలంగాణ సర్కార్‌తో కీలక ఒప్పందం