

జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత అవసరం – డబ్ల్యూజెఐ నేతల డిమాండ్
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 16 :- ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన వ్యాఖ్యల అనంతరం జర్నలిస్టుల గుర్తింపు ప్రమాణాలపై స్పష్టత ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజెఐ) నేతలు డిమాండ్ చేశారు.ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో పలువురు జర్నలిస్టులు టీయుడబ్ల్యూజే నుంచి డబ్ల్యూజెఐలో చేరారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. తాడూరు కరుణాకర్ మాట్లాడుతూ, జర్నలిస్టుల గుర్తింపుకు అక్రిడిటేషన్ కార్డులు ప్రామాణికమా? లేదా సంస్థలు ఇచ్చే ఐడెంటిటీ కార్డులా? అన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ కొత్త కార్యవర్గం:
అధ్యక్షుడు: అబ్రమేని దేవేందర్
ఉపాధ్యక్షుడు: మేకర్తి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: కారెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి కోశాధికారి: ఏర్పుల రాజు ఈ కార్యక్రమంలో డబ్ల్యూజెఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ తదితరులు పాల్గొని కొత్త కమిటీని అభినందించారు