

పెద్ద బజారులో అనుమతుల్లేకుండా టవర్ నిర్మాణం – కాలనీవాసుల ఆందోళన
మద్దతు తెలిపిన ఎన్. హెచ్.ఆర్.సి జిల్లా అధ్యక్షులు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 :- నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పెద్ద బజారు చౌరస్తా వద్ద రాత్రికి రాత్రి ఓ షాపుపై టవర్ నిర్మించడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా టవర్ ఎలా కడతారని ప్రశ్నించారు. పవిత్ర అనే కాలనీవాసురాలు మాట్లాడుతూ, టవర్ వల్ల హార్ట్ సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేకపోతే రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళలు, పురుషులతో కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గల్లీ మాజీ కార్పొరేటర్ బట్టు రాఘవేంద్ర, కాలనీవాసులు, ఎన్‌హెచ్‌ఆర్‌సి జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర మరియు , టీం సభ్యులు పాల్గొన్నారు