

మాజీ సీఎం కేసీఆర్ మార్చురీలో ఉన్నారని ఎక్కడా అనలేదు: శ్రీధర్‌బాబు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. BRS పార్టీ మార్చురీలో ఉందని మాత్రమే అన్నారని మంత్రి పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మార్చురీలో ఉన్నారని ఎక్కడా అనలేదని వెల్లడించారు.సభలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే బాగుంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. కేవలం ఒక కుటుంబం కోసం సభ నుంచి వెళ్లిపోవటం సరికాదని ఆయన పేర్కొన్నారు.