

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు కోరారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ పై ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తమిళనాడు నుంచి కీలక నేతలు కే ఎన్ నెహ్రూ, ఎంపీ ఎన్.ఆర్ ఇలాంగో పాల్గొన్నారు.
ఈనెల 22న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
ఈ క్రమంలో డీలిమిటేషన్ పై 22 మార్చి 2025న జరుగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో డీఎంకే ఇతర పార్టీలు కలిసి ఈ అంశంపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం తమిళనాడులో పలు ప్రాంతీయ పార్టీలు కలిసి డీలిమిటేషన్ పై వారి అభిప్రాయాలను తెలియజేస్తాయి.
సీఎం రేవంత్ రెడ్డితో డీలిమిటేషన్ చర్చ
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో డీలిమిటేషన్ పై ముఖ్యమైన చర్చలు జరిగినట్లు సమాచారం. సీఎం, ఈ ప్రక్రియపై తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ అమలు తెలుగు వారి అభ్యంతరాలు, సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాలనుకుంటున్నట్లు తెలిసింది.
డీఎంకే నేతల ఆందోళన
డీలిమిటేషన్ పై తమిళనాడు డీఎంకే నేతలు ఇప్పటికే తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ తమ రాష్ట్రంలో ప్రజల హక్కులను హరించే దిశగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో డీలిమిటేషన్ కు సంబంధించి సరికొత్త నిర్ణయాలు తీసుకునే విధానంలో తెలంగాణ ప్రజల హక్కులకు కూడా ఇది విరుద్ధంగా ఉంటుందని, దీనిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పేర్కొన్నారు.. KP