గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదు : హరీశ్ రావు..!!

గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదు : హరీశ్ రావు..!!

అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు. గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ ని కూడా వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. లగచర్ల, న్యాల్కల్, అశోక్ నగర్లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్. ఇవ్వాళ కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ ఫాఫర్మేషన్ చేశారు” అని హరీష్ రావు విమర్శించారు

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..