ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం – తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన లక్ష్మీ నగర్ కాలనీవాసులు

మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 12 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల కోసం చేపట్టినది. ఇండ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని స్థానిక కిందిస్థాయి నాయకులు ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ నగర్ తాండకు చెందిన 17 మంది తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ, మంగళవారం తహసీల్దార్ మోతీరాం కు ఫిర్యాదు అందజేశారు. అలాగే స్థానిక ఎస్సై అశోక్ కుమార్ కు కూడా ఈ విషయాన్ని వివరించారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్, తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బుధవారం ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. నాయకుల చేతివాటం రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో లక్ష్మీ నగర్ తాండ వాసులు శాంతించి వెనుదిరిగారు.

  • Related Posts

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని…

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల. మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జర్రుపుకోవకని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు గురువారం వారి కార్యాలయం నుండి ప్రకటన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    భార్యలు తాగుతున్నారని పోలీస్ స్టేషన్లో భర్తల ఫిర్యాదు!

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..