

రామగుండం: అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం అర్ధరాత్రి వేళ రామగుండం రైల్వే స్టేషన్, గోదావరిఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్, పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. నూతనంగా రామగుండం పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుంది. పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సీపీ ప్రత్యక్షంగా పరిశీలించారు.