బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు

బ్రతుకు.. బ్రతికించు.. అందుకోసం పోరాడు

మన ఆంధ్రప్రదేశ్ కోసం ఒకే ఒక్క త్యాగం చేద్దామా మిత్రమా !

యాచిస్తున్నాము..
అర్జిస్తున్నాము మిత్రమా ..

ఆశక్తి గల వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ “ఆహ్వానం”

మేడా శ్రీనివాస్ , ఆత్మ ఘోష ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

మనోరంజని ప్రతినిధి రాజమండ్రి మార్చి 11 :- 50 సంవత్సరాలు నిండిన వారంతా బిడ్డల భవిష్యత్ , భద్రత కోసం ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టిలకు అతీతంగా ఏక మవుదాం ! బిడ్డలకు సంపదను , ఆరోగ్యాన్ని ఇద్దాం . ఆలోచించు మిత్రమా ..
ప్రస్తుత కార్పొరేట్ రాజకీయ పార్టి లతో ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేదనేది జగమెరిగిన సత్యం . ఇంకా ఆ పార్టి లను భజంపై మోయటం మన బిడ్డల అభ్యున్నతికి, భవిష్యత్ కు ద్రోహం చేయటం వంటిది కాదా ! మిత్రమా..ఎప్పుడు చంద్రబాబు , జగన్ ను మోస్తు పేదరికాన్ని వారసత్వంగా పొందటమేనా మన ప్రగతి మిత్రమా . ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయ భజనతో ఎవరికి వారు మనకు మనమే పాడి కట్టుకుంటున్నాము కాదా మిత్రమా . వీరిలో ఏ ఒక్కరైనా మనకోసం , మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం ఆలోచించేటోళ్ళు ఉన్నారా ! లేరని తెలిసి వారిని మోయటం తప్పుకాదా ! మిత్రమా..
అడవిలో జింకలు పులికి ఆహరంగా మారతాము అని తెలిసి కూడా వాటి బిడ్డల కోసం అడవి దాటకుండా ఆత్మ విశ్వాసంతో మనో దైర్యంతో పులిని తప్పించుకునో కొన్ని పరిస్థితుల్లో తిరగబడో అక్కడే జీవిస్తాయి . అక్కడే ఉంటాయి ..
మరి మనం మనుషులం నేడు మన కళ్ళ ముందు మనకు , మన బిడ్డలకు ఏ భవిష్యత్ కనపడటం లేదు . మన కళ్ళముందే మనం దోపిడీకి గురైతున్నాము . అయినా మనలో తెగింపు లేదు . బిడ్డలపై ప్రేమను కనపరుస్తూనే మనలో వున్న భయంతోను , బలహీనతల తోను వారి జీవితాలను బుగ్గి పాలు చేసేతున్నాము . మన ప్రమేయం లేకుండానే బిడ్డల జీవితాలను చిదిమెస్తున్నాము .
బిడ్డలను ప్రేమించే ప్రతి కుటుంబం ఆ బిడ్డలకు భద్రత గల సమాజాన్ని ఇవ్వాలనుకోక పోవటం అందుకోసం బ్రతకక పోవటం మంచి తల్లిదండ్రులు అని ఎలా అనిపించుకోగలరు మిత్రమా . నేడు ఎదిగిన మగ బిడ్డకు చట్ట భద్రత లేదు . ఆడ బిడ్డ మానానికి , ప్రాణానికి రక్షణ లేదు . ఇదేనా మన గొప్ప మానవ బ్రతుకులు …మన శ్రమను దోచుకుంటు మనం మోయలేని పేదరికాన్ని మన శరీరాల్లో ఒక భాగంగా భరిస్తున్నాము . ఏదో విధంగా చాలి చాలని అవసరాలు తీర్చుకుంటు, పౌష్టిక ఆహారానికి దూరంగా కుటుంబం మొత్తం ఆకలి తీర్చుకుంటున్నాము . అంతే గాని ఈ హీన బ్రతుకులకు మరో గొప్ప ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించక పోవటం మానవ తప్పిదం కాదా మిత్రమా ! మరి మనలో మానవత్వం వుంది అని నిరూపించుకోవద్దా మిత్రమా ..
ప్రస్తుత పరిస్థితుల్లో
ఏ మనిషి ఎంత కాలం జీవిస్తారో ఎవ్వరికి తెలియదు . బ్రతికుండగానే ఒకే ఒక్కసారి మానవత్వాన్ని ఊపిరిగా తీసుకుని భద్రత గల సమాజాన్ని మన బిడ్డలకు ఇవ్వలేమా !ఆలోచించు మిత్రమా .. ఆచరించి చూడు ఉజ్వల భవిష్యత్ తద్యం . నీ కళ్ల ముందే నీ బిడ్డకు బంగారు భవిష్యత్ ను చూపిద్దాం. సాధిద్దాం ..బలహీనమైన జింక కూడా బిడ్డ భద్రత కోసం క్రూర మృగాలను సైతం ఎదిరిస్తున్నాయి . మనం మనుషులం కదా ! ఆ మూగ జింకకు వున్న మాతృత్వం , తెగింపు మనలోను వుంది . మరి ఎందుకు ఆలస్యం . ఒకే ఒక్కసారి వుందని నిరూపించుకుంద్దాం . మురికి జీవితాలకు స్వస్తి చెప్పుదాం . సంపన్న వెలుగులను చూద్దాం ..మరణించిన తల్లిదండ్రులను అక్క చెల్లిళ్లను, అన్నదమ్ములను తలచుకుంటు స్మరించుకుంటు దుక్కించటం కాదు మానవ జీవితం అంటే వారి మరణాలకు గల పేదరికాన్ని , అకృత్య కారణాలను తుడిచి వేద్దాం . కుటుంబాలను సంతోషంగా ఉంచుదాం . రాజకీయ మార్పే లక్ష్యంగా కుటుంబంపై ప్రమాణం చేసుకుని మన ధ్యేయన్ని , లక్ష్యాన్ని జయిద్దామా ! మిత్రమా ..
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు హైదబాది కార్పొరేట్ సంపన్న ఆంధ్రులకు రాజకీయ చిరునామా తప్ప శాశ్వత చిరునామా మాత్రం కాదు అనేది నిజం . కార్పొరేట్ సంపన్న పెత్తందారులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తుండటం ఆంధ్రులకు అవమానం కాదా ! జన్మతః మరణించే వరకు ఆంధ్రుడుగా జీవించే వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ పాలనకు అర్హులు . వారికి మాత్రమే రాష్ట్ర అభిమానంపై మక్కువ ఉంటుంది . అని గమనించండి మిత్రమా ..మన రాష్ట్రం నుండి మనమే స్వతంత్రంగా ఎదుగుదాం . కార్పొరేట్ రాజకీయ పార్టీకు కనువిప్పు కలిగిద్దాం . పేదరికాన్ని తుడిచివేద్దాం. సంపన్నులుగా స్థిరపడదాం . అందుకోసం ప్రణాళిక సిద్దం. మీరు సిద్ధమా మిత్రమా ! బిడ్డల భవిష్యత్ ను గుర్తించి బలహీనతలను వదిలేయండి. ఒక్క మార్పుతో మీ కళ్ల ముందు మన బిడ్డల బంగారు భవిష్యత్ వుందని మరువకండి మిత్రమా ..
50 ఏళ్లు దాటిన వారంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమిద్దాం . ప్రగతిని సాధిద్దాం . యువతి యువకులు ఈ మహోన్నత చారిత్రిక ఉద్యమాన్ని ప్రోత్సహంచండి. బలోపేతం చేయండి . మేమంతా మీ భవిష్యత్ కోసం ఏ త్యాగానికైనా సిద్దపడతాం . సంపదను , భవిష్యత్ ను మీ దరికి చేరుస్తాం .
50 ఏళ్లు జీవితాన్ని చుసిన వారు అందరు సగం జీవితాన్ని చూసిన వాళ్ళమే . అందుకే ఆ వయస్సు వారు అంత వారి అనుభవాలను సమాజం కోసం , బిడ్డల భవిష్యత్ కోసం త్యాగాలకు సిద్దపడదాం . యువతకు అద్భుతమైన జీవితాలను ఇద్దాం . రండి నేను సైతం అంటు త్వరపడండి..
మన ఆడ బిడ్డలకు రక్షణ లేకపోయినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాము . మన బిడ్డలకు భద్రత లేకపోయినా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము . చట్ట పరమైన హాక్కు బారంగా మారినా ! న్యాయం ఖరీదైనదిగా వెంబడిస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నాము . మరి మన బిడ్డల అభ్యున్నతి కోసం , మన రాష్ట్ర భవిష్యత్ కోసం మనం మారలేమా ! మిత్రమా..
నేటి పాలనలో నేరస్తులు చట్ట సభల్లోను , అన్యాయాలను , అక్రమాలను ప్రశ్నించే పౌరులు జైళ్ళ లోను వుంటున్నారు . మానవ హక్కులు నిత్యం దారి తప్పుతున్నాయి . చట్టం సాక్షిగా వేధింపులు. న్యాయం అందని ద్రాక్షగా మారింది . ఎంతో ప్రాముఖ్యత గల న్యాయవాద – వైద్య , విద్యా వృత్తులు నాణ్యత లేని ఖరీదైన అంగడి సరుకుగా మారిపోతున్నాయి . తద్వారా సమ సమానత్వం లేని సమాజంలో బిక్కు బిక్కు మంటు జీవిస్తున్నాము .ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయం లోనైనా పౌర సేవలకు సంబందించి ప్రజల మన్ననలుపొందగలుగుతున్నారా ! మిత్రమా. ప్రజలకు సేవకులుగా విధులు నిర్వహించాల్సిన ఉద్యోగులు ప్రజల పాలిట అవినీతి బక్షకులుగా మారారు . అయినా భయం, బలహీనతలతో
ఏ అన్యాయాన్ని ప్రశ్నించ లేని దిక్కుమాలిన జీవితాలకు బానిసలుగా మారి ఎలాగో లాగ బ్రతికేస్తున్నాము . ఇలాంటి ఆటవిక పాలనలో మన కోసం ఒక భద్రత గల పాలన వద్దా ! మిత్రమా ఆలోచించండి..
నేటి పోలీస్ – రెవిన్యూ శాఖలు ప్రజల పాలిట కాలకేయుల మాదిరి వున్నారు . ఈ రెండు శాఖల్లో చట్ట బద్ధమైన హక్కుతో న్యాయాన్ని పొందిన ఏ ఒక్క పౌరుడైనా / కుటుంబీకు లైనా అయినా ఉన్నారా ! మిత్రమా . మన కుటుంబ సభ్యులను మన కళ్ళముందే అవమాన కరమైన మాటలతో హృదయాన్ని చిదిమేస్తారు . చట్ట భద్రత లేని జీవితం మానసిక వికలాంగుని వలే భయంతో మౌనాన్ని పోషిస్తున్నాము . మార్పు కోసం చైతన్య వంతులం అని నిరూపిద్దాం ..ఈ మహోన్నత చారిత్రిక ఉద్యమానికి తోలి అడుగు నాదే . అందు కోసం ఎలాంటి ఒత్తిడిల నైనా , వేధింపుల నైనా తట్టు కోవటానికి నేను సిద్ధం . చివరకు నా రాష్ట్రం కోసం, నా దేశం కోసం నా ప్రాణాన్ని సైతం వదులుకోవటానికి నేను సిద్దం . సిద్దం ..నా లక్ష్యం కోసం సిద్దపడే వారు అందరు మరో స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో భాగస్వాములుగా బావించి ఈ భవిష్యత్ మహోన్నత ఉద్యమంలో మీ తోడ్పాటును అందించండి .
బలహీనతలు లేని రాజకీయాలను బలపారుద్దాం . సంపదను సాధిద్దాం .
మెరుగైన సమాజం – భద్రత గల పాలన మీ కోసం ఎదురు చూస్తుంది మిత్రమా .ఓటును ఇవ్వండి – సంపదను ఇస్తాం .. నేను సిద్దం . మీరు సద్దామా !

జై ఆంధ్రప్రదేశ్ ,
సేవ్ ఆంధ్రప్రదేశ్..

భారత్ మాతాకు జై..

గమనిక : తమ తమ నియోజకవర్గాలకు ఇంచార్జ్ లుగా బాధ్యతలు చేపట్టండి . వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపొంది చట్ట సభలకు రండి .. అందుకోసం “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టి ప్రోత్సహిస్తుంది..

–మేడా శ్రీనివాస్ , MA , LLM , MA(జర్నలిజం) MA(Mjmc)
అధ్యక్షులు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..
మొబైల్ : 9248777222 ..

  • Related Posts

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం మనోరంజని ప్రతినిధి మార్చి 13 :- ఆంధ్రప్రదేశ్ : జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సా. 3.30 గంటల నుంచి సభ మొదలుకానుందని, 1600…

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ ! రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి.. కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు, వైసీపీ అధినేత జగన్ కు ఓ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలి.ఎస్పీ జానకి షర్మిల.

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    రేపు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    జగన్‌, కేసీఆర్‌లకు చివరి చాన్స్ !

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..

    ఫామ్‌హౌస్ కేసు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీకి రెండోసారి నోటీసులు..