

రేపు జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు!
TG: తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన 1,286 మంది జూనియర్ లెక్చరర్లకు రేపు(బుధవారం) సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది