

దారుణం.. పింఛను కోసం తండ్రిని గెంటేసిన పిల్లలు
మనోరంజని ప్రతినిది హనుమకొండ మార్చి 11 -తెలంగాణ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో సొంత పిల్లలు అమానుషానికి పాల్పడ్డారు. పిల్లల నారాయణ అనే రిటైర్డ్ టీచర్ తన పిల్లలు వేధిస్తున్నారని ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేశారు. తన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచానని, ప్రస్తుతం పెన్షనుతో బ్రతుకుతున్నానని చెప్పారు. పెన్షన్ కోసం పిల్లలు వేధిస్తూ ఇంటినుంచి వెళ్లగొట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, వారి వేధింపుల నుంచి కాపాడాలని కోరారు