కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ అలా చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య వచ్చి ఉండేది కాదన్న ముఖ్యమంత్రి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా? అని ప్రశ్న

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తెలియదన్న ముఖ్యమంత్రి

తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే, ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్‌తో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్‌ను గద్దె దించి తాము అధికారంలోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా అని ఆయన ప్రశ్నించారు.మంద కృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పోటీ పరీక్షల ఫలితాలకు, రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. మంద కృష్ణ మాదిగ బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో విడుదలైన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని గుర్తించాలని సూచించారు. ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన హెచ్చరించారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 39 సార్లు కాకుంటే 99 సార్లు ఢిల్లీకి వెళతామని, నిధుల కోసం వెళితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు

  • Related Posts

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్ మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 13 :- నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను గురువారం మాజీ జడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.…

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాల, సరస్వతీ శిశు మందిర్, శ్రీ అక్షర పాఠశాల, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ముందస్తుగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

    రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి