

మళ్లీ కలవర పెడుతున్న పెద్దపులి
మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా మార్చి09 -పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. మంథని మండలం అడవి సోమన్‌పల్లి, బట్టుపల్లి, గ్రామల్లో పులి సంచరిస్తున్న తెలుస్తుంది, దీంతో అటవీ గ్రామాల ప్రజలకు ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫారెస్ట్ అధికారుల సమా చారం మేరకు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమన్‌పల్లి, భట్టు పల్లి, గ్రామాల పరిధిలోనీ అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు గా తెలుస్తున్నది. దీంతో అధికారులు అడవి సోమన్‌పల్లి, వెంకటాపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయిపేట, గ్రామాలతో పాటు చిన్న ఓదాల, గోపాలపూర్ ఖమ్మం పల్లి, సీతంపల్లి గ్రామస్తులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాత్రి వేళలో రైతులు పొలాల వద్దకు వెళ్లకూడదని పొలాల వద్ద ఎలాంటి కరెంట్ తీగలతో ఉచ్చు పెట్టొద్దని,అటవీశాఖ అధికారులు సూచించారు