

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 08 :- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ముధోల్ సీఐ జ్8. మల్లేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో మహిళ పోలీసులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఓ మహిళ ఉన్నత స్థాయిలో ఉంటే కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంజువ్ కుమార్ , పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు