మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క

మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క

మనోరంజని ప్రతినిది హైదరాబాద్:మార్చి 08 :-
సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగర పోలీసు ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ 2k & 5k రన్- 2025 కార్యక్రమం ఈరోజు ఉదయం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పంచా య‌‌తీ రాజ్, గ్రామీణా భివృద్ధి, మ‌‌హిళా శిశు సంక్షేమ శాఖ‌‌ల మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నా రు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..మహిళలందరికీ అంతర్జా తీయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంటే సమజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారు.. మహిళలు అంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్ లా చూస్తున్నారని అన్నారు. పురుషులు.. మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు.మహిళలు అంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి.. ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకో వాలని చెప్పారు. రాష్ట్రంలో మహిల వ్యక్తిత్వం వికాసం కోరుకోవాలి.. సమాజంలో మహిళలను ఎదుగనిద్దం, కాపాడుదామని మంత్రి సీతక్క తెలిపారు.మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మహిళలకు చేయూత అందిస్తున్నారని, పోలీస్ శాఖ ఫ్రీ హాండ్ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం నుంచి అమలయ్యే అన్ని హామీలను అందిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

  • Related Posts

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం.. మనోరంజని,నిజామాబాద్ ప్రతినిధి:: పౌర సరఫరాల శాఖ నిజామాబాద్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డిని ఆర్మూర్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ అజీమ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు…

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు? మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 17 – రాజకీయాలు కలుషిత మయ్యాయో రాజకీయ నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    పౌరసరఫరాల శాఖ మేనేజర్ శాలువతో సన్మానించిన అబ్దుల్ అజీం..

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు?

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    తెలంగాణ సిఫార్సు లేఖలకు టీటీడీ ఆమోదం

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

    ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.