ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

మనోరంజని ప్రతినిధి అమరావతి :మార్చి 07 ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూ రైంది. కూటమి నేతలపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసును నమోదు అయిన సంగతి తెలిసిందే అయితే విజయవాడ, సూర్యాపేట, పీఎస్ లో నమోదైన కేసులో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూ రు చేసింది.. పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులకు సంబం ధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్తావించా నని, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి కోర్టుని అభ్యర్థించారు. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మరో 14 కేసులు ఉన్నాయి. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని. తనపై ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని, తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారం టూ పోసానిపై రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటిని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. తనపై రాజకీయ ద్వేషంతోనే తప్పుడు కేసులు పెడుతు న్నారని పిటిషన్ లో పేర్కొన్న పోసాని.. ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

  • Related Posts

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!!

    హోలీ పండుగ వేళ పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!! కులాలు, మతాలు, ప్రాంతాలు అనే తేడా లేకుండా నిర్వహించుకునే పండుగల్లో హోలీ(Holi Festival) ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆరోజున ఉత్సాహంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో ముందస్తు హోలీ సంబరాలు

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం