

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..!!
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మార్చి 27వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ కేబినెట్(Telangana Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మరోవైపు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నది. ఆశావహుల సంఖ్య భారీగా పెరగడంతో ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.