ముధోల్లో బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవాలు

ముధోల్లో బిజెపి ఆధ్వర్యంలో విజయోత్సవాలు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 06 :- కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల మండల కేంద్రమైన ముధోల్ లో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు కోరి పోతన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకులు కొత్త బస్టాండ్ సమీపంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. బిజెపి నాయకులు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సమిష్టిగా కృషి చేయడం వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలోపేతం చేయడంలో భాగంగానే రెండు స్థానాల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థులు అన్ని స్థానాలను కైవసం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శిశు మందిర్ పాఠశాలలో స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు దేవోజి భూమేష్, మండల ఎమ్మెల్సీ ఇంచార్జ్ సంతోష్ కదం, బీజేపీ నాయకులు తాటివార్ రమేష్, బత్తినోళ్ళ సాయినాథ్, ధర్మపురి శ్రీనివాస్, సప్పటోల్ల పోతన్న(లడ్డు), నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    వాడేకర్ లక్ష్మణ్ఆనంధీత ఫౌండేషన్ చైర్మన్మోటివేషన్ స్పీకర్* భైంసా పట్టణంలో ఒక ఆధునిక ఆడిటోరియం నిర్మించడం అత్యంత అవసరం. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, యువతకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, సాంస్కృతిక సంఘాలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. ప్రస్తుతానికి పెద్ద కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన…

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!! .800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    “భైంసా పట్టణంలో ఆడిటోరియం – సమగ్ర అభివృద్ధికి అవసరం “

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    తమిళ భాషపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం