బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్..

కోళ్లఫారాల్లో పెరుగుతున్న గుడ్ల నిల్వలు

చెన్నై: నామక్కల్‌ కోళ్ల ఫారాల్లో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉండడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామక్కల్‌ మండల పరిధిలో నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పల్లడం తదితర ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా కోళ్లను పెంచుతున్నారు. ఆ కోళ్లు ప్రతిరోజు 5 కోట్ల గుడ్లు పెడుతుంటాయి. ఈ గుడ్లను రాష్ట్ర ప్రభుత్వ పౌష్టికాహార పథకంలో వినియోగిస్తుండగా, పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లు విస్తరణ, ఎండల కారణంగా ప్రజలు కోడిగుడ్ల వినియోగం తగ్గించారు.దీంతో, కోళ్ల ఫాంలలో గుడ్లు నిల్వలు పెరుగుతున్నాయి. డిమాండ్‌ తగ్గడంతో ఐదు రోజుల్లో గుడ్డుపై సుమారు 1.10 పైసలు తగ్గించి ప్రస్తుతం ఫాం ధర 3.80 పైసలుగా ఉంది. ప్రస్తుతం పాంలలో 2 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి పాడయ్యే అవకాశముందని, అలాగే, నిల్వలు కూడా పెరిగే అవకాశముందని ఫాం యజమానులు వాపోతున్నారు

  • Related Posts

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి మనోరంజని ప్రతినిధి మార్చి 16 – అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34…

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 16 – ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హతమయ్యాడు.ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠం

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    మార్చి 17వ తేదీ వేములవాడ శ్రీ రాజన్న స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా…

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    ఎమర్జెన్సీ వార్డులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్

    ఎమర్జెన్సీ వార్డులో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్