

700 సంవత్సరాల చరిత్ర గల్గిన శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయం.
భక్తిశ్రద్ధలతో ప్రతి సం. ఘనంగా ఉత్సవాలు.
నిర్మల్ ఫిబ్రవరి 27 (ప్రజా మలుపు)
శివుడు,శంకరుడు, మహాదేవుడు, సోమేశ్వర్ ,రాజేశ్వర్ , రాజన్న, రాజేశ్వరి రాజు భాయి రాజేష్, మల్లన్న పాపన్న గంగాధర్ గంగుబాయి …….ఇలా ప్రతి ఇంటి నుండి ఇద్దరు లేదా ముగ్గురి పేర్లలో ఆ పరమేశ్వరుని పేర్లు వినిపించే గ్రామం పేరే పార్డి (బి).ఇది నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఎవరి నోట విన్న ఎవరిని పిలిచినా భగవంతుని నామం ఉచ్చరించడం ఆనందంగా భావిస్తారు అక్కడి ప్రజలు. ఆ గ్రామంలో ప్రాచీన కాలం నుండి అనగా గత 700 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వరుని ఆలయం ఆ గ్రామానికి ఆరద్య దైవంగా నిలిచింది. అందుకే ఆ గ్రామంలో ఆ దేవుని ఆశీస్సులతో గ్రామం సుఖసంపదలతో వర్ధిల్లుతున్నది. అందువలన ప్రతి కుటుంబంలో కనీసం రెండు మూడు ఆ దేవుని పేరు పెట్టుకుంటారు . *
మానవ రూపమైన పార్వతమ్మతో దేవుని కళ్యాణోత్సవం
700 సంవత్సరాల చరిత్ర గలిగిన శ్రీ రాజరాజేశ్వర దేవుని ఆలయనికి నిదర్శనం ఆలయం ముందున్న ఆరు పార్వతమ్మల సమాధులు. రాజరాజేశ్వరి దేవుని యొక్క వివాహం ప్రతి సంవత్సరం ఆలయంలో జరిపిస్తారు. అది విగ్రహాలతోని కాదు మానవ స్వరూపం కలిగిన పార్వతమ్మతో ఇది నిజం. మానవ రూపమైన పార్వతమ్మ చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో చేరి ఆ దేవునిపై నమ్మి, దేవుని భార్యగా జీవితాంతం చిరస్థాయిగా దేవునికి తన జీవితాన్ని అంకితం చేస్తుంది. ఆమె తో ప్రతి మహాశివరాత్రి రోజు గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీ దేవునితో వివాహం జరిపిస్తారు. ఆమె మరణానంతరం ఆమెను ఆలయం ముందర అంత్యక్రియలు జరిపి గుడి కడతారు. ఇలాంటి పార్వతమ్మల గుడిలో ఇప్పటివరకు ఆరు ఉన్నాయి. అనగా ఒక్కొక్క పార్వతమ్మ కనీసం 80/90 సంవత్సరాలు జీవించిన నేటి వరకు 700 సంవత్సరాలు పూర్తయినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలా కొనసాగుతూ వస్తున్న ఆచారాన్ని గత 15 సంవత్సరాల క్రితం ముగింపు పలికారు. పార్వతమ్మ గా పిలవబడే అమ్మ గత 15 సంవత్సరాల క్రితం స్వర్గ వాసులైనందున,ఆనాటి నుండి మానవ రూపమైన పార్వతమ్మ ను దేవునితో చేసే పెళ్లి ఆచారాన్ని నిలిపివేశారు. నేటి కలియుగాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలను దేవుని భార్యగా ఆలయంలో ఉంచడం శ్రేయస్కారం కాదని భావించారు గ్రామస్తులు. ఇప్పుడు పార్వతమ్మ యొక్క విగ్రహాన్ని దేవుని విగ్రహంతో వివాహం జరుపుతారు.
రాజరాజేశ్వరుని (దేవుని) ఆజ్ఞ లేనిదే గ్రామంలో శుభకార్యాలు జరగవు.
గ్రామంలో కొలువైన రాజరాజేశ్వరుని (దేవుని) ఆజ్ఞ లేనిదే గ్రామంలో వివాహ ముహూర్తాలకు ఆస్కారం లేదు. ప్రతి సంవత్సరం వచ్చే రోజు వచ్చే మహాశివరాత్రి జరిగిన రెండవ రోజైన మాఘమాసం శుక్లపక్షం చతుర్థి అమావాస్య మధ్య రాత్రి శివపార్వతుల వివాహం జరుగును. మరుసటి రోజు నుండి గ్రామంలో వివాహాలు ఇతర శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఇది కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం .దీన్ని చులకనగా భావించిన కొందరు గ్రామస్తులు మూఢనమ్మకంగా భావించి దేవుని పెళ్లి కంటే ముందు పెళ్లిళ్లు చేశారు. ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారానికి విరుద్ధంగా జరిగిన పెళ్లిళ్లు ఎక్కువ రోజులు నిలవకపోవడం, అకారాణంగానే కష్టాలు తెలియని సమస్యలు చిక్కును రావడం మొదలయ్యాయి. ఈ ఇబ్బందులు గమనించిన గ్రామస్తులు ఆ రోజు నుండి దేవుని పెళ్లి కంటే ముందు తమ గ్రామంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. ఇలా ఆ గ్రామం యొక్క ఆచారాలు నాటి నుండి నేటి వరకు కొనసాగుతునేఉంది.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి ఐదు రోజులుగా ఈ గ్రామంలో ఐదు రోజుల ఉత్సవాలు కొనసాగుతాయి. మహాశివరాత్రి త్రయోదశి శుక్ల పక్షం శ్రవణ నక్షత్రం ఉదయం 6గంటలనుండి రాత్రి 12గంటలవరకు శ్రీ శ్రీ రాజరాజేశ్వరునికి కి అభిషేకలు నిర్వహించి. అదే విధంగా సాయంత్రం దీప జ్యోతి కార్యక్రమం. జెండా కార్యక్రమం నిర్వహిస్తారు.
రెండవ రోజు చతుర్దశి రోజు ఉదయం 10గంటలకు శివాపార్వతుల గంగ స్నానం ఆచరించి.అదే రోజున రాత్రి 8గంటలకు దేవునికి సంబంధించిన మఠం నందు పైడి కార్యక్రమం. జరుపుతారు. అనంతరం బాజ భజంత్రీలతో భారతీయ సంస్కృతి సాంప్రదాయంతో అమావాస్య మధ్య రాత్రి సమయంలో
శ్రీరాజరాజేశ్వర మందిరంలో శివాపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. దేవుని వివాహానికి వచ్చిన భక్తులందరూ కట్న కానుకలు సమర్పించుకుంటారు. మూడవరోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల చేసి జాగరణ చేస్తారు.
నాల్గవ రోజు సాయంత్రం దేవునికి సమర్పించడానికి నైవేద్య ప్రసాదాల రూపంలో అంబల్లను (దొంతులు) ఎత్తుకొని వందల సంఖ్యలో భక్తులు తీసుకొని వచ్చి ఆలయం చెట్టు ప్రదక్షిణ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ అంబల్ల ప్రసాదం సమర్పించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి దొంతుల కార్యక్రమంలో పాల్గొంటారు.నాల్గవ రోజు. జాతరకు వచ్చిన భక్తులకు మానసిక ఉల్లాసం కొరకు గ్రామస్తులు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ కుస్తీ పోటీలలో పాల్గొనడానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో పైల్వాల్లో తరలివస్తారు. మతసామరస్యానికి గుర్తుగా జరిగే ఈ కుస్తీ పోటీలలో అన్ని మతాలకు సంబంధించిన పహిల్వాన్లు పాల్గొంటారు. చిన్న పిల్లలతో కుస్తీ పోటీలు ప్రారంభం చేసి అంచెలంచెలుగా బాహుబలి లాంటి పహిల్వాన్ లతో ముగింపు పలుకుతారు. గెలుపొందిన పైల్వాన్లకు తగినంత పారితోషకం బహుమనాలు అందజేస్తారు. అదేవిధంగా జాతర కొరకు కుస్తీల పోటీలు వీక్షించడానికి వచ్చిన ఇతర గ్రామాల నుండి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు
రాత్రి 12గంటల మధ్య రాత్రిలో నూతనంగా పెళ్లి జరిగిన శివపార్వతులతో నాగ వెళ్లి కార్యక్రమం నిర్వహించి అనంతరం,అగ్ని గుండం ప్రవేశల కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ పూజారులు భక్తులు అగ్నిగుండంలో ప్రవేశించి కాలినడకతో నడుస్తారు. 5వ రోజు జాతర కార్యక్రమం ఇలా సాఫీగా జరిగే ఈ ఐదు రోజుల మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఇలాంటి అవాంఛనీయాల్సిన సంఘటన జరగకుండా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు వచ్చే భక్తులకు అలాంటి ఇబ్బంది కలకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తారు.