

వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
అలరించిన భక్తి గీతాలు- సాంస్కృతిక కార్యక్రమాలు
మనోరంజని ప్రతినిధి ముధోల్ ఏప్రిల్ 06 :-
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమిని పురస్క రించుకొని సీతారాముల కళ్యాణ మ హోత్సవం వైభవోపేతంగా వేద పండితుల చేతుల మీదుగా ఆలయ కమిటీ చైర్మన్ ఆర్మూర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు.

గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు గత మూడు రోజులుగా కొనసాగుతు న్నాయి. దీంతో చివరి రోజు సీతారా ముల కళ్యాణ మహోత్సవానికి గ్రామంలోని మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాము ల కళ్యాణం ఆలయంలో చూడముచ్చటగా కొనసాగింది. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ సీతా రాముల కల్యాణ విశిష్టతను భక్తులకు తెలియజేశారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా భక్తి పాటలు పలువురిని అలరించాయి. శ్రీరామాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీలో గెలుపొం దిన కళాకారులకు బహుమతులను ప్రధానం చేశారు. ఆలయ కమి టీ చైర్మన్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రామాలయ అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతోపాటు ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. మూడు రోజులపాటు జరిగిన ఉత్సవాలు గ్రామస్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు దోహదపడ్డాయి . ఈ కార్యక్రమంలో ఆల య కమిటీ నిర్వాహకులు రావుల శ్రీని వాస్ , సభ్యులు రావుల పోశెట్టి, సురుగుల పోశెట్టి, అశోక్ , ముత్యం, సునీల్ గురు స్వామి, సట్ల ప్రసాద్, సాయిలు తో పాటు తదితరులు పాల్గొన్నారు