53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి..

కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి బ్రాహ్మణి, కుమారుడు జి కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్‌ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది

  • Related Posts

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’.. కోర్టు బెంచ్‌ క్లర్క్ లైంగిక వేధింపులు..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అందరికీ న్యాయం జరిగే కోర్టులోనే మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో…

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

    అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…..జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్, మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 16 :- నిర్మల్ పట్టణ పరిధిలో ఉన్న రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు

    ఎస్ జెడబ్ల్యూహెచ్ఆర్ సి డైరెక్టర్ గా ఉమ్మాయి దయానంద రావు