

శ్రీశైలంలో నకిలీ టికెట్ల కలకలం
మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩
శ్రీశైలంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులను కొందరు కేటుగాళ్లు దోచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు భక్తులు ఈ విషయాన్ని ఆలయ సీఈవో మధసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు