

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఐపీఎస్ అధికారితో సహా మరో వ్యక్తి మృతి
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్చి29 – నాగర్ కర్నూల్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవర పల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరం తా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమా చారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పై ఈగలపెంట ఎస్సై వీరమల్లు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కొందరు శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్న క్రమంలో సరిగ్గా దోమల పెంట గ్రామ సమీపంలోకి రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న పీకేట్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇన్నోవా కారు లో ఉన్న ఇద్దరికీ బలమైన గాయాలు అయ్యాయి వెంటనే క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్స్ తో పాటు ఈగల పెంట ఎస్సై పోలీసు వాహనంలో అచ్చం పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరు డాక్టర్ సుధాకర్ పటేల్ ఐపీఎస్ మహారాష్ట్ర, రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారని, తెలిసింది,ఈయనకు తల పై బలమైన గాయాలు అయినట్లు సమాచారం. మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు రెండు కాళ్లకు బలమైన గాయాలు అయ్యాయని సమాచారం. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దండ సమీపంలో ఉన్న ఎన్నం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిం చగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు