

ఇందూరు నేత అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 24 :- హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో లెజెండ్ సోషల్ సర్వీస్ కల్చరల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన MLC మధుసూదన చారి వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు అందజేశారు.ఈ సందర్భంగా ఇందూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎన్. అపర్ణ శ్రీనివాస్ పాటిల్‌కు విశిష్ట ఉగాది పురస్కారం అందించగా, ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, కష్టపడితే గుర్తింపు తప్పకుండా వస్తుందన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మహిళా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.