

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా మెదక్ జిల్లాలోని ఏడు నియోజకవర్గలకు ఏడు అంబులెన్స్ల ను
ప్రభుత్వ ఆసుపత్రులకు కానుక ఇచ్చిన నట్లు తెలిపిన మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 24 – మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టిన రోజు సందర్బంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజికవర్గాలకు 7 అంబులెన్సులు ప్రభుత్వ ఆస్పత్రికి కానుకగా ఇచ్చినట్లు తెలిపిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు . గత ఆదివారం నాడు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నాడు నర్సాపూర్ నియోజికవర్గం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పావనికీ అంబులెన్సు ను అందించడం జరిగిందని. నీరు పేద ప్రజల సేవలకు ఉపయోగించాలని కేంద్రంలో మోడీ పరిపాలన ఉన్నంతవరకు దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బిజెపి పరిపాలన సాగిస్తుందని భారతదేశంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మూడవసారి గెలుపొంది మూడవసారిగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల శ్రేయస్సు తన శ్రేయస్సుగా భావించి దేశ ప్రజలు అంటే నా కుటుంబం అని ఆయన భావనలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తన అడుగుజాడలో నడవాలని నేడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావడానికి ముఖ్య కారకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అందరికీ తెలుసు హిందుతత్వం అంటే భారతదేశమేనని దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఎల్లవేళలా సుఖశాంతులతో ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని దేశ ప్రధాని లక్ష్యమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి పార్టీలుగా నిలబడితే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మన పార్టీ తరపు నుండి నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేయాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, సంగసాని సురేష్ , మండల్ అధక్షలు చంద్రియా, నగేష్, నాగప్రభూ, పెదపూలి రవి, దాసు, బీజేపీ నర్సాపూర్ అసెంబ్లి నాయకులు భాదేబాలరాజ్, సంగసనిరాజు, దిగంబర్, సంగమేష్, రాములునాయక్, సదానందం, ఆంజనేయులు గౌడ్, ఆంజనేయులు, భిక్షపతి, అర్వింద్ వాల్దాస్, ఉదయగౌడ్, మహేందరగౌడ్, నగేష్ గౌడ్, శ్రీకాంతచారీ, చారి, శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, పూర్ణచందర్, స్వామి, శేఖర్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
