

ALERT: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – ఏప్రిల్ 1 నుంచి TDS(మూలం వద్ద పన్నుకోత) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సీనియర్ సిటిజన్ల FD & RD పై వార్షిక ఆదాయం రూ. లక్ష వరకు ఉంటే టీడీఎస్ వర్తించదు. ప్రస్తుతం రూ.50వేల వరకే ఉంది. అదేవిధంగా, సాధారణ ప్రజల వడ్డీ ఆదాయం రూ. 50,000 మించకపోతే బ్యాంకులు టీడీఎస్ కట్ చేయవు. బీమా ఏజెంట్లు, స్టాక్ బ్రోకర్లకు వార్షిక కమిషన్ ఆదాయం రూ.15,000 మించితే టీడీఎస్ వర్తించేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ. 20,000 కు పెంచారు