

గుడ్‌న్యూస్.. తెలంగాణలో వర్షాలు
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – తెలంగాణ : ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలయ్యాయి. ఉదయం 10గం. దాటితే ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి 22 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది