బాసరలో అలరించిన అష్టావధానం
మనోరంజని ప్రతినిధి బాసర మార్చి 16 :-
చదువుల తల్లి పుణ్యక్షేత్రమైనా బాసరలోని శారద నగర్ లో గల కోటి పార్థివ లింగస్తూప సాహితి ద్వాదశ జ్యోతిర్లింగ మందిరం హాల్లో ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు ప్రముఖ అవదానులు బొల్లా ప్రగడ శశిశర్మ చే నిర్వహించిన అష్టావధాన ఆద్యంతం ఆకట్టుకుంది. నిర్వాహకులు, పద్యకవులు, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు -నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, బి. వెంకట్ కవి, శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల అంబికనాథశర్మ నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు సంచాలకులుగా పద్యకవులు- బొందిడి పురుషోత్తమరావు, ప్రాశ్నికులుగా డా.కోవెలశ్రీనివాసాచార్యులు( నిషిద్ధాక్షరి), కడారి దశరథ్ (సమస్యాపూరణం), బి. వెంకట్( దత్తపది), పీసర శ్రీనివాస్ గౌడ్ (వర్ణన), గంగుల చిన్నాన్న (న్యస్తాక్షరి), కొండూరు పోతన్న (ఛందోభాషణము), జాదవ్ పుండలీక్ రావు పటేల్ (ఆశువు), బసవరాజు (అప్రస్తుతప్రసంగం) లతో ఈఅష్టావదానం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వరంగల్ జిల్లావాస్తవ్యులు కవి, పండితులు, సమస్యా పృచ్ఛక పద్య వశంకర కంది శంకరయ్య, కవులు, కళాకారులు, సాహితి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక నృత్యాలు
బాసర జ్ఞాన సరస్వతి క్షేత్ర విలసిత శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము సరస్వతి స్తూప, కోటి పార్థివ లింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము నందు ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు పలువురిని అలరించాయి. హైదరాబాద్ శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి వారిచేత నిర్వహించిన బాలికల నృత్యాలను అవధాని బోల్లాప్రగడ శశి శర్మ, కంది శంకరయ్య, సంచాలకులు బొందిడి పురుషోత్తం రావు , అష్టావధాన ప్ఫచ్చకులు , పద్య కవులు డా కోవెల శ్రీనివాస చార్యు . బి .వెంకట్,జాధవ్ పుండలిక్ రావు పాటిల్, కడారి దశరథ్, గంగుల చిన్నన్న, కొండూరు పోతన్న, బసవరాజు,పీసర శ్రీనివాస్ గౌడ్, ఆశ్రమ నిర్వాహకులు సంధ్య అంబిక నాథ శర్మ దంపతులు తదితరులు అభినందించారు