

అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత
అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు
– తహసీల్దార్ లింగం మూర్తి
మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, అనుమతులు లేకుండా రాత్రిపగలు ఎలాంటి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో, తహసీల్దార్ పక్క సమాచారంతో బుధవారం రాత్రి మహారాష్ట్ర సరిహద్దు జవుల (బి) వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంపై కేసు నమోదు చేసి, ఆ వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా, తహసీల్దార్ లింగం మూర్తి మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణా గురించి ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులు అక్రమ ఇసుక రవాణా మరియు డంపింగ్ చేస్తే, ప్రజలు అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు