24 ఏళ్లకే అమ్మాయిల పెళ్లి చేయండి: లవ్ జిహాద్ పై BJP నేత PC జార్జ్..
కూతుళ్లకు 24 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేయాలని క్రిస్టియన్ తల్లిదండ్రులకు కేరళ BJP నేత, మాజీ MLA పీసీ జార్జ్ సూచించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 'ఒక్క మీనాచిల్ తాలూకాలోనే 400 యువతుల్ని కోల్పోయాం. అందులో 41 మందే దొరికారు' అని వివరించారు. ఎరట్టుపెట్టాలో ఈ మధ్యే దొరికిన పేలుడు పదార్థాలు రాష్ట్రమంతా తగలబెట్టేందుకు సరిపోతాయని అన్నారు.