

23 కోట్ల రూపాయలతో నియోజకవర్గమంతటా సిసి రోడ్ల నిర్మాణం
ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో 23 కోట్ల రూపాయలతో ప్రస్తుతం సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు. ఆదివారం భైంసా మండలంలోని కుంసర, కామోల్, మాటేగాం, గ్రామాల్లో 44 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దశ లవారీగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పంట పొలాలకు వెళ్లడానికి రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో బాలాజీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానన్నారు. కామోల్ గ్రామంలో పోచమ్మ ఆలయ రోడ్డుకు 10 లక్షల రూపాయలు, మాటేగాం లో కొరడి గణపతి ఆలయానికి వెళ్లే రోడ్డు కు 28 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా కుంసర గ్రామంలో సి సి రోడుకు ఆరు లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు శాలువ తో సత్కరించి, స్వాగతించారు. కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ రజాక్,భైంసా మండల బిజెపి అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు , సౌంవ్లీ రమేష్,పండిత్ రావ్ పటేల్ మాజీ వైస్ ఎంపీపీలు గంగాధర్, నర్సారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, మాజీ సర్పంచులు లక్ష్మణరావు, శ్యామ్ రావు పటేల్, మధుసూదన్ రెడ్డి, హైమద్, నాయకులు ప్రతాప్ సింగ్, అశోక్, మహేందర్, సాయి,సత్యనారాయణ, దత్తుపటేల్, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..


