16-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

16-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

మేషం

ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు నుండి విముక్తి కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.

వృషభం

ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన పనుల్లో స్వంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.

మిధునం

దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఋణ ఒత్తిడి వలన శిరోభాధలు తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కర్కాటకం

మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

కన్య

బంధు మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

తుల

ఉద్యోగమున బాధ్యతలు సరిగా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు.

వృశ్చికం

అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు

అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయం అందుతాయి.

మకరం

ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి. వృత్తి బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుంభం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

మీనం

ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కావు.

  • Related Posts

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు…

    రాశి ఫలితాలు

    11-03-2025 మంగళవారం రాశి ఫలితాలు మేషం వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .