

14 రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి
హైదరాబాద్ – మైలార్దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన
పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి
స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడిన తల్లి
తల్లే పసికందుని చంపినట్లుగా నిర్ధారించిన పోలీసులు
ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా గుర్తించిన పోలీసులు
భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందును హత్య చేసిన తల్లి
పసికందు అనుమానాస్పద మృతి చేదించిన పోలీసులు
పసికందుది హత్యని తేల్చి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తమిళనాడుకు చెందిన దంపతులు.. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వచ్చిన మణి, విజ్జు