

14వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డేట్ ఫిక్స్!
మనోరంజని ప్రతినిది మార్చి 01 14వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డేట్ ఫిక్స్!
తెలంగాణలో 14వేల అంగన్వాడీ టీచర్లు,హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్‌ని మహిళాదినోత్సవం రోజు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మహిళాదినోత్సవం(ఈనెల 8) రోజు పలు పథకాలను సీఎం ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించనున్నారు. అలాగే, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.