*10 వ తరగతి విద్యార్ధులకు పరీక్షల సందర్బంగా పాటించాల్సిన సూత్రాలు

*10 వ తరగతి విద్యార్ధులకు పరీక్షల సందర్బంగా పాటించాల్సిన సూత్రాలు

  1. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.తరువాత చదవవద్దు చదివిన ఉపయోగం పెద్దగా ఉండదు
  2. తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి.ఈ సమయంలో చదివింది బాగా గుర్తుంటుంది
  3. మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.మీరు ఈ సంవత్సరం నుండి చదివిన అంశాల ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు.
  4. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.
  5. ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ చేయండి కానీ యోగ కానీ చేయండి.
  6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.
  7. అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.
  8. తర్వాత పుస్తకం (main points) తిరగెయ్యండి చదివిన అంశాలు వ్రాయండి వ్రాస్తే పరీక్ష లో బాగా గుర్తుకు వచ్చే అవకాశం ఉంది.
  9. పౌష్టికాహారం లైట్ ఫుడ్ తీసుకోండి.
  10. ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి. 8:30 నుండి తొమ్మిదిన్నర వరకు గంట సేపు ఎవరితో మాట్లాడకండి పుస్తకం చదవకండి
  11. 8.50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. తోటి విద్యార్థులతో మాట్లాడకండి అనవసర అంశాలు అసలు మాట్లాడవద్దు.
  12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి చిరునవ్వుతో వెళ్ళండి.
  13. ఉపాధ్యాయులు (Invigilators) చెప్పే సూచనలు గమనించి పాటించండి
  14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
  15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.
  16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.
  17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.
  18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.
  19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.
  20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.
  21. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.
  22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్ ట్రై చేయండి.
  23. గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడుసార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి
  24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.
  25. తప్పులు,ప్రశ్న నెంబర్లు సరి చూడండి.
  26. బిట్ పేపర్ ఇవ్వగానే దారం తో కట్టండి.
  27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.
  28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.
  29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి.. నీ స్నేహితులతో అసలు మాట్లాడకండి
  30. నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.
  31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.
  32. బొమ్మలు,మ్యాప్ , గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి.
  33. బుద్దిమంతులుగా ఉండండి.కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.
    *
    పరీక్ష రోజు తీసువాల్సిన సూచనలు

1 విద్యార్థులు వారికి అనుకూలంగా ఉన్న దుస్తులు ధరించాలి వీలైతే కాటన్ దుస్తులు ధరించాలి

2 * విద్యార్థులు ఎలాంటి పేపర్ మెటీరియల్ లాంటివి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసికెళ్ళకూడదు వారి దగ్గర ఎగ్జామ్స్ రాసేటప్పుడుఎగ్జామ్ పాడ్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి*

3.OMR Sheet లను విద్యార్థులు వారి వివరాలు సరి చూసుకోవాలి ఏవైనా తప్పులు ఉంటే ఇన్విసిలెటర్ దృష్టికి తేవాలి*

4.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేకపోతే ఇన్విసిలేటర్ దృష్టికి తీసుకెళ్లి ఇంకో బుక్ లెట్ తీసుకోవాలి

*5. విద్యార్థులు వారి వివరాలు సరి చూసుకుని OMR లో సూచించిన గడిలో సంతకం చేయాలి

6_.ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. రాయాలి

.7స్టూడెంట్స్ వారి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలితీసుకొని వెళితే డిబార్ చేస్తారు

8 పార్ట్-బి పైన, మ్యాప్,గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేసారో లేదో పేపర్ఇచ్చే ముందు సరిచూసుకోవాలి

*9 ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థులు చేత THE END అని రాసి ఇన్విసిలేటర్ తో సంతకం చేయుంచకోవాలి

*10.విద్యార్థలు వారికీ కావాల్సిన వాటర్ బాటిల్ వస్తువులు ఖచ్చితంగ తీసుకువెళ్ళాలి పక్కవాళ్ళమీద ఆధారపడవద్దు.

  • 11 ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులు విద్యార్థులు పక్కవాళ్లను ఇతరులగూర్చి ఆలోచించడం మానెయ్యాలి

*12. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక అన్ని సమాధానాలు రాసామే లేదో ఒకసారి చూసుకోవాలి.

*.13 ప్రతి రొజు 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వాలి.
ఫిజికల్ సైన్స్ బయో -సైన్స్ కు మాత్రం 12 పేజీల బుక్లెట్ ఇస్తారు.

*14.విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని ట్యాగ్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్ బిట్ పేపర్ ని చివరగా ట్యాగ్ చేయాలి.

*15. మీకు ఇచ్చిన ఫోటో అటెండెన్స్ షీట్ మీ ఫోటో సరిచేసుకునిదానికి ఎదురుగా అ రోజు పరీక్ష తేదికి ఎదురుగా సంతకం చేయాలి

16 విద్యార్హులు దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి

*17 పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులు అన్ని సమాధానాలు రాసారో లేదో ఒకసారి సరిచేసుకుని ఇచ్చిన సమాధానపత్రాలు ట్యాగ్ చేయాలి

*18 OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ కాకుండా మడతలు పడకుండ గీతలు పడకుండ చూసుకోవాలి మీ జీవితానికి మిరే కథనాయకుడు కాబట్టి విజయం సాధించాలంటే మనం మాత్రమే శ్రమించాలి మీ విజయం ద్వారా మీకు మీ కన్న తల్లిదరిద్రులకు మీ పాఠశాలకు మీ ఊరికి పేరు తెచ్చే అవకాశం ఉంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ పరీక్షలలో విజయం మీదే

అల్ ది బెస్ట్

మీ రాదారి నాగరాజు
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్
తెలంగాణా ఆదర్శ పాఠశాల లచ్చపేట
మోటివేషనల్ స్పీకర్ లైఫ్ స్కిల్స్ కోచ్ సిద్దిపేట జిల్లా

  • Related Posts

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గారి వ్యక్తిగత సహాయకులు విజేందర్ రెడ్డితో కలిసి చిట్యాల రామచంద్రంకు ఘన నివాళులు మనోరంజని ప్రతినిధి…

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 – మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    స్వర్గీయ వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆగ్రహం

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.

    ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు, మహిళల పట్ల మర్యాదగా ఉండాలి.