

10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21, 2025 నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల సందర్భంగా, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ సందర్శించారు.ఈ సందర్శనలో పరీక్ష కేంద్రంలో ఉన్న బందోబస్తు ఏర్పాట్లు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న కనీస సదుపాయాలు, అత్యవసర వైద్య సేవలను ఆమె పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు.జిల్లా ఎస్పీ చేసిన ముఖ్య ప్రకటనలు:సెక్షన్ 163 BNSS యాక్ట్ – 2023 ప్రకారం అన్ని పరీక్షా కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను ముందుగా మూసివేయాలనే నోటీసులు జారీ చేయడం.
పరీక్ష కేంద్రాల వద్ద ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు నైలు, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు
