🗓నేటి రాశి ఫలాలు🗓

28.03.2025
🗓నేటి రాశి ఫలాలు🗓
🐐 మేషం
28-03-2025)

మీ ధర్మం మీకు రక్షణ కల్పిస్తుంది. తోటివారితో కలసిపోవడం అవసరం. ముఖ్య నిర్ణయాలలో మీ నమ్మకాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్తమం.

🐂 వృషభం
28-03-2025)

మీ జీవితంలో సంతృప్తి, సౌఖ్యం నెలకొంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. భక్తిపూర్వకంగా దేవాలయ సందర్శనం మేలు చేస్తుంది.

💑 మిధునం
28-03-2025)

నిరంతర శ్రమకు విజయఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించండి.
హనుమంతుని ఆరాధనతో శ్రేయస్సును పొందుతారు.

🦀 కర్కాటకం
28-03-2025)

బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. మానసిక శాంతి చేకూరుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం.

🦁 సింహం
28-03-2025)

ముందుచూపుతో పనులు చేయడం వల్ల శ్రమ తగ్గుతుంది. శుభకాలాన్ని ఆనందంగా గడుపుతారు. తోటివారి సహకారం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడం శ్రేయస్కరం.

💃 కన్య
28-03-2025)

దైవబలం మీకు తోడుగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికంగా మీకు లాభదాయక సమయం. కుటుంబంతో కలసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధనతో శుభఫలితాలు పొందుతారు.

⚖ తుల
28-03-2025)

సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు. కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నా పట్టుదలతో ముందుకు సాగండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శివారాధన శాంతిని ఇస్తుంది.

🦂 వృశ్చికం
28-03-2025)

చిన్న చిక్కులు ఎదురైనా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. అశ్రద్ధతో పెట్టిన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయడం మీకు మేలు చేస్తుంది. కనకధారాస్తోత్రం చదవండి.

🏹 ధనుస్సు
28-03-2025)

మనోధైర్యంతో ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజించండి.

🐊 మకరం
28-03-2025)

ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. ప్రతిభకు గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల సమయం. శ్రీసుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం మీకు శ్రేయస్సును తీసుకొస్తుంది.

🏺 కుంభం
28-03-2025)

ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాల విషయమై జాగ్రత్త అవసరం. ఖర్చులు నియంత్రించాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం.

🦈 మీనం
28-03-2025)

గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధగా ముందుకు సాగండి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివాదాలకు దూరంగా ఉండండి.
శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించడం శ్రేయస్కరం.

  • Related Posts

    29-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    29-03-2025 / శనివారం / రాశి ఫలితాలు మేషం సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.…

    నేటి రాశి ఫలాలు

    24.03.2025 నేటి రాశి ఫలాలు 🐐 మేషం24-03-2025) మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. నవమంలో చంద్రుడు అనుకూలించట్లేదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. కీలక విషయాల్లో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం