హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు భిన్న సంస్కృతుల్లో హోలీ జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా అక్రమార్కులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. హోలీ వేళ డ్రగ్స్ అమ్మేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ లోయర్ దూల్పేట్ మల్చిపురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా, ఆగ, మగ అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. ఇదే అదునుగా గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతికారు. ఈ మేరకు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి పెట్టి విక్రయాలు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ విక్రయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి పట్టుకున్నారు. నిందితుడి నుంచి గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌నూ సీజ్ చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నిందితుడు వాటిని తయారు చేసిన విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా, సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి తెలిపారు. సాధారణ సమయాలు, పండగల వేళ డ్రగ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని అంజిరెడ్టి సూచించారు.

  • Related Posts

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు మనోరంజని ప్రతినిధి మార్చి 15 :- శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు.…

    బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం…

    బట్టల వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం… వరంగల్ : బ్యాంకు అధికారుల వేధింపులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం. షాప్‌ ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న కుటుంబసభ్యులు. చిలుకూరి క్లాత్‌ స్టోర్‌ను నడుపుతున్న కుటుంబం. మంటల్లో కాలి ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు..

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం