

హైదరాబాద్ పాతబస్తీలో విషాద ఘటన చోటుచేసుకుంది. దబీర్‌పూర్ ఫ్లైఓవర్‌పై నుండి తాహనజర్ అనే వివాహిత దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.